బాత్రూంలో పడగ విప్పిన నాగుపాము..మహిళ పరుగులు

బాత్రూంలో పడగ విప్పిన నాగుపాము..మహిళ పరుగులు

ఉదయాన్నే లేచి బాత్రూంకి వెళ్లిన ఓ మహిళకు అక్కడ నాగుపాము కనిపించడంతో ఒక్కసారి గుండె ఝల్లుమంది.  నాగుపాము పడగవిప్పి  బుసలు కొడుతూ కనిపించడంతో ఆ మహిళ కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీసింది. మహిళ కేకలతో స్థానికులు అక్కడికి వచ్చి పాము బయటకు వెళ్లకుండా బాత్రూం తలుపులు వేశారు.. తర్వాత పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో  ఆ నాగుపామును పట్టుకెళ్లాడు. ఈ  ఘటన తమిళనాడులోని కొయంబత్తూరు జిల్లా రామనాధపురంలో జరిగింది. అయితే  అపార్ట్ మెంటులో కొందరు మహిళలు నివాసం ఉంటున్నారు.