
వనపర్తి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఓ భారీ మొసలి చిక్కింది. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక నాన్ చెరువులో చేపలు పట్టేందుకు వల విసిరారు. అయితే వల ఒక్కసారిగా బరువెక్కింది. ఏదో పెద్ద చేప వలలో చిక్కుకుని ఉంటుందని ఈ మత్స్యకారులు భావించారు. తీరా బయటకు వలను తీయగా భారీ మొసలిని చూసి షాక్‌కు గురయ్యారు.మొసలిని బయటకు తీయడానికి ప్రయత్నం చేయగా రాకపోవడంతో గ్రామస్థులు వేరే పెద్దవలలు వేసి ఎట్టకేలకు మొసలిని బయటకు తీశారు. మొసలిని చూడటానికి గ్రామస్థులు అధిక సంఖ్యలో వచ్చారు.