హనుమాన్ భజనలతో మార్మోగిన కొండగట్టు

హనుమాన్ భజనలతో మార్మోగిన కొండగట్టు

జగిత్యాల జిల్లా: మల్యాల మండలం, ముత్యంపేట్ గ్రామంలోని కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ భజనలతో ఆలయం మార్మోగింది. రెండేళ్ల నుంచి కరోనా వల్ల  జయంతి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు. ఈసారి వైరస్ ఎఫెక్ట్ తగ్గి అనుమతించడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. హనుమాన్ దీక్షదారులు ఇరుముడులు సమర్పించి... మాల విరమణ చేశారు.  కొండగట్టు ఆలయానికి భారీగా ఆదాయం వస్తున్నా హనుమాన్ జయంతికి అధికారులు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు భక్తులు. కోనేరులో మురికినీరు ఉండటం వల్ల డబ్బులు ఇచ్చి బయట స్నానాలు చేశామన్నారు. ఆలయ పరిసరాల్లో మాల విరమణ చేసి వదిలేసిన దుస్తులు, చెత్త చేదారం పేరుకుపోయాయన్నారు. విశ్రాంతి గదులు లేకపోవడం ఇబ్బందిగా ఉందన్నారు భక్తులు.  కొండగట్టులో కనీస సౌకర్యాలపై  అధికారులు దృష్టి పెట్టాలన్నారు హనుమాన్ భక్తులు. ఏటా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.