ప్రారంభమైన ప్రజావాణి... భారీగా తరలొచ్చిన బాధితులు

  ప్రారంభమైన  ప్రజావాణి... భారీగా తరలొచ్చిన బాధితులు

హైదరాబాద్ బేగంపేట్ లోని పూలే ప్రజాభవన్లో ప్రజావాణి మొదలైంది. సిటీతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు ప్రజావాణికి తరలివచ్చారు. ఇందులో ఎక్కువగా భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారే ఉన్నారు. తెల్లవారుజాము నుంచే పబ్లిక్ ప్రజా భవన్ దగ్గరకు చేరుకున్నారు.  మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కొనసాగనుంది. హైదరాబాద్ తో పాటు జిల్లాల నుంచి తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకునేందుకు జనం వచ్చారు. 

ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ..  బాధితులు,ప్లెక్సీ ఏర్పాటు చేసుకొని ప్రజవాణికి వచ్చారు. కష్టపడి కొనుక్కున్న భూముని ఎమ్మెల్యే దానం... ఆయన అనుచరులతో కబ్జా చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నుంచి మా భూములు కాపాడి తమకు అప్పగించాలని కోరుతున్నారు.