బల్దియా ఆదాయం ఢమాల్: కరోనా..వరదలు..ధరణి.. గ్రేటర్ ఎన్నికలతో ఆగమాగం

బల్దియా ఆదాయం ఢమాల్: కరోనా..వరదలు..ధరణి.. గ్రేటర్ ఎన్నికలతో ఆగమాగం

ఆస్తిపన్ను కింద 1,189.30 కోట్లు వసూలు

గతేడాదికంటే తక్కువ

ఎర్లీబర్డ్​, వన్​టైం స్కీమ్​ల ద్వారానే వసూలు

 

హైదరాబాద్​,వెలుగు:  ఈ ఏడాది బల్దియాకు ఇన్​కం తగ్గిపోయింది. ప్రాపర్టీ ట్యాక్స్​కింద మొత్తం 1189.30కోట్లు వచ్చింది. కరోనా కారణంగా బల్దియా ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం ఆస్తిపన్ను రాబట్టేందుకు ఎర్లిబర్డ్, వన్​ టైమ్ స్కీమ్​లను ప్రవేశపెట్టింది. అయితే వీటి ద్వారా గతేడాది వచ్చిన రూ.1,472కోట్ల కంటే ఎక్కువ వసూలును టార్గెట్​గా​పెట్టుకుంది. కాగా వరదలు, ధరణి,ఎన్నికల కారణంగా అనుకున్నంత వసూలు కాలేదు. గత నెల 15వరకు ఉన్న వన్​టైమ్ స్కీమ్​కూడా నిలిచిపోయింది. ఇక కొత్త స్కీమ్​ఏదైనా తెస్తేనే ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరేళ్లుగా గ్రేటర్​ జనాలకు స్కీమ్​లు బాగా అలవాటు కావడంతో సాధారణ సమయంలో ఆస్తిపన్నులు చెల్లించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. చెల్లించని వారు కూడా ఆఫర్​ ఇచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. స్కీమ్స్​ ఉన్పప్పుడు ప్రతి నెలా వంద కోట్లకు పైగా ఇన్​కమ్​ బల్దియాకు వస్తుంది. ఒక్కోనెలలో అత్యధికంగా రూ.200కోట్ల వరకు ఉంటుంది.  ఏప్రిల్​,మే ల్లో ప్రవేశపెట్టిన ఎర్లీబడ్​ స్కీమ్​ కింద580 కోట్లు వసూలైంది. ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్​ 15వరకు వన్​ టైమ్ స్కీమ్​ అమలు చేయడంతో మరో 280 కోట్లు వచ్చాయి.

బిల్​కలెక్టర్లకు వేరే డ్యూటీలతో..

ఆస్తి పన్ను వసూలులో బిల్​ కలెక్టర్లదే కీలక పాత్ర.  జీహెచ్​ఎంసీలో ప్రస్తుతం 380 మంది ఉన్నారు. ఈ ఏడాది వచ్చిన 1,189.30కోట్లలో రూ.509కోట్లను వీరే వసూలు చేశారు.  అయితే వీరు కరోనా డ్యూటీలు, ధరణి సర్వే, వరదలతో పాటు మొన్న జరిగిన గ్రేటర్​ ఎన్నికల్లోనూ  పూర్తిస్థాయిలో పనిచేశారు. దీంతో వారు పన్నుల వసూలుకు ఫీల్డ్​లోకి వెళ్లలేకపోవడంతోనూ ఇన్​కం పెరగలేదు. ఇక నవంబర్15వరకు వన్​టైమ్ స్కీమ్​ఉన్నా రూ.42కోట్లు వసూలవగా , ఈ నెల 17వరకు కేవలం 9 కోట్లు మాత్రమే వచ్చాయి.