గొడుగులు, రెయిన్ కోట్స్‌‌కు మస్తు గిరాకి

గొడుగులు, రెయిన్ కోట్స్‌‌కు మస్తు గిరాకి

వర్షంలో తడిస్తే సీజన్ వ్యాధులతో పాటు దగ్గు, జలుబు, జ్వరం కామన్ గా వస్తాయి. దీంతో వర్షం నుంచి తప్పించుకోవడానికి పలు మార్గాలు వెతుకుతుంటారు. వానలకు తడవకుండా రెయిన్ కోట్స్, గొడుగులను వాడుతుంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో వీటిని బ్యాగుల్లో తప్పకుండా తీసుకెళుతారు. ఇప్పుడు వర్షకాలం వచ్చేసింది. దీంతో చాలా మంది గొడుగులు, రెయిన్ కోట్లను కొనుక్కోనేందుకు దుకాణాలకు వెళుతున్నారు. దీంతో ఈ వ్యాపారం మూడు గొడుగులు, ఆరు రెయిన్స్ కోట్స్ లా సాగుతోంది. కస్టమర్లను ఆకట్టుకొనేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. వివిధ కలర్లు, అందమైన డిజైన్లలో రెయిన్ కోట్స్, గొడుగులను సిద్ధం చేశారు. డిఫరెంట్ కలర్లలో గొడుగులు లభ్యమౌతున్నాయి.

ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, గుజరాత్, త్రిపురతో వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులు ఇప్పుడు హైదరాబాద్ లో దొరుకుతున్నాయి. కరోనాతో రెండేళ్లు పెద్దగా గిరాకీ లేక నష్టపోయామని ఈ ఏడాది ఇప్పుడిప్పుడే బిజినెస్ పుంజుకుంటోందన్నారు వ్యాపారులు. ముడి సరుకుల రేట్లు పెరగడంతో వస్తువుల ధరలు కూడా పెరిగాయన్నారు. అయితే చాలా మంది కస్టమర్లు బేరం ఆడుతున్నారని వెల్లడించారు. రెయిన్ కోట్లు ధరలు ఈసారి బాగా పెరిగాయంటున్నారు ప్రజలు. గతేడాదితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ధరలు తగ్గిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అజాగ్రత్తగా ఉండొదంటున్నారు డాక్టర్లు. తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని వ్యాధులు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.