యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలం

యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. వారాంతం సెలవు రోజు కావడం, మరోవైపు వేసవి సెలవులు ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి యాదాద్రికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఆలయంలోని వివిధ విభాగాల క్యూలైన్లు, కొండపై పరిసరాలు భక్తులతో సందడి నెలకొంది. రూ.150 క్యూలైన్లు నిండి భక్తులు  బయటకు బారులుదీరారు. దీంతో ప్రసాదం విక్రయశాల క్యూలైన్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సివస్తోంది.

స్వామి వారి  ఉచిత దర్శనం 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. బాలాలయంలో నిత్య కల్యాణోత్సవం, ఆర్జిత సేవలు, కొండకింద పాత గోశాలలోని సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో భక్తులు కుటుంబసమేతంగా పాల్గొని మొక్కు తీర్చుకున్నారు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాన్ని కొనుగోలు చేసిన భక్తులు ఆలయ ఘాట్‌రోడ్‌, పెద్దగుట్టపైన ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్లలో పిల్లాపాపలతో సేదతీరుతున్నారు.