యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. యాదగిరి గుట్టపై ఎటూ చూసిన భక్తులే కనిపిస్తున్నారు. రద్దీ పెరిగినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం నుంచి కొండ కింద బస్సులు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బస్సులు సరిగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ భక్తులు ఫైర్ అయ్యారు. బస్సులు లేకపోవటంతో చాలా మంది భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుంటున్నారు. సౌకర్యాలు లేక చంటిపిల్లలతో భక్తులు అవస్థలు పడుతున్నారు.