అంతుచిక్కని బంగారం లెక్కలు.. మూడు రోజులు పడుతూ ఒక్క రోజులో భారీగా జంప్ !

అంతుచిక్కని బంగారం లెక్కలు.. మూడు రోజులు పడుతూ ఒక్క రోజులో భారీగా జంప్ !
  • మళ్లీ పసిడి ధర జంప్​
  • రూ.3,500 పెరిగి రూ.1.29 లక్షలకు 

న్యూఢిల్లీ: పెళ్లిళ్ల కోసం నగల వ్యాపారులు, రిటైలర్లు భారీగా కొనడంతో ఢిల్లీలో మంగళవారం (నవంబర్ 25) బంగారం ధర 10 గ్రాములకు రూ. 3,500 పెరిగి రూ. 1,28,900 కు చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, మూడు రోజుల నష్టాలను ముగిస్తూ, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర రూ. 3,500 పెరిగి 10 గ్రాములకు రూ. 1,28,300 కు చేరుకుంది. 

వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో ధర రూ. 5,800 పెరిగి రూ. 1,60,800 కు చేరుకుంది.  డాలర్ బలహీనపడటం,​  వడ్డీ రేటు కోత అంచనాలు పెరగడంతో బంగారం ధర పెరిగిందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్‌‌కు చెందిన సీనియర్​ అనలిస్ట్​ -(కమోడిటీస్)​ సౌమిల్ గాంధీ తెలిపారు. న్యూయార్క్​మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్​ధర 0.09 శాతం తగ్గి 4,131.09 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్​ 0.40 శాతం తగ్గి 51.15 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.