కిలో టమాటా 250 రూపాయలు.. కొనాలంటే లాక్షాధికారులం కావాలి..

కిలో టమాటా 250 రూపాయలు.. కొనాలంటే లాక్షాధికారులం కావాలి..

భారతీయ వంట గదిలో విరివిగా ఉపయోగించే కాయగూర టమాట ధరలు గత కొంత కాలంగా ఎంతలా పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. చివరికి కిలో టమాట ధర సెంచరీ దాటి, డబుల్ సెంచరీ వైపుగా పయనిస్తోందా అని అనుమానాలు కలిగాయి. ఇప్పుడు ఆ అనుమానాలు నిజమయ్యేలా డబల్ సెంచరీ కూడా దాటి ట్రిపుల్​సెంచరీ వైపుగా దూసుకెళ్తున్న టమాట ధరల్ని చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. జులై 7న గంగోత్రిలో కిలో టమాట ధర రికార్డు స్థాయిలో రూ.250 పలికింది.

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ.180 – 200 మధ్య ఉంది. టమాట పండించే ప్రాంతాల్లో వాతావరణ మార్పుల వల్ల పంట నష్టం జరిగింది. 

దీనికి తోడు సరఫరా గొలుసులో అంతరాయం కలిగింది. చివరికి దిగుబడి తగ్గి.. ధరలు చుక్కలనంటుతున్నాయి. వాటిని కొనడానికి సైతం ప్రజలు ఆసక్తి చూపట్లేదని అమ్మకందారులు చెబుతున్నారు. చెన్నైలో కిలో టమాటా రూ.100–130 వరకు ఉండగా, సీఎం స్టాలిన్ ప్రభుత్వం రేషన్​ షాపుల్లో రూ.60 చొప్పున రాయితీతో అందిస్తోంది. బెంగళూరులో కిలో రూ.101 –  121 వరకు పలుకుతోంది. ఆగస్టు వరకు ధరాభారం తగ్గేట్లు కనిపించట్లేదని వ్యవసాయ శాఖ నిపుణులు అంటున్నారు.