
హైదరాబాద్ సిటీ, వెలుగు: అక్టోబర్ 5 నుంచి 12 వరకు నిర్వహించిన స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్టెస్ట్పరీక్షలో (ఎన్ఎస్ఏటీ) తెలుగు రాష్ట్రాల నుంచి లక్షమందికి పైగా విద్యార్థులు పాల్గొన్నట్లు నారాయణ విద్యాసంస్థల కోర్‌కమిటీ సభ్యురాలు రమా నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులు డబ్బుల్లేక చదువును మధ్యలోనే వదిలేసే పరిస్థితులు రాకుండా వారిని ప్రోత్సహించేందుకు ఏటా ఎన్ఎస్ఏటీ పరీక్షను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులతోపాటు స్కాలర్ షిప్ అందించనున్నట్లు వివరించారు. సామాజిక బాధ్యతగా ఇక ముందు ఈ ఎగ్జామ్ కొనసాగిస్తామన్నారు.