
హైదరాబాద్, వెలుగు : ప్రాపర్టీ షోకి మొదటి రెండు రోజులు మంచి రెస్పాన్స్ వచ్చిందని క్రెడాయ్ హైదరాబాద్ పేర్కొంది. బయ్యర్లు యాక్టివ్‌గా పాల్గొన్నారని తెలిపింది. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షో ఆదివారంతో ముగియనుంది. రెరా రిజిస్ట్రేషన్ ఉన్న 100 కి పైగా ప్రాజెక్టులను కొనుగోలుదారుల కోసం ప్రదర్శనకు ఉంచారు. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్ స్పేస్‌ను ప్రదర్శనకు ఉంచామని క్రెడాయ్ పేర్కొంది.
ప్రాపర్టీ కొనుక్కునే ముందు అన్ని వివరాలను బయ్యర్లు ప్రాపర్టీ షోలో తెలుసుకోవచ్చని వెల్లడించింది. డెవలపర్ల స్టాళ్లు పెద్ద సంఖ్యలో క్వరీస్ అందుకున్నాయని, ఆసక్తి ఉన్నవారు సైట్‌లను సందర్శించడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. సిటీలోని హోమ్ బయ్యర్లు ఎక్కువగా నమ్ముతున్న ప్రాపర్టీ షో తమదేనని క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి అన్నారు. మెంబర్ డెవలపర్ల నుంచి కేవలం రెరా రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్టులు మాత్రమే ప్రదర్శనలో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
దీంతో హోమ్ బయ్యర్ల నమ్మకం పొందామని పేర్కొన్నారు. సిటీలోని వేరు వేరు ప్రాపర్టీల గురించి తెలుసుకోవడానికే కాకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై అవగాహన పెంచుకోవడానికి ఈ ప్రాపర్టీ షో సాయపడుతుందని అభిప్రాయపడ్డారు. రెసిడెన్షియల్ , కమర్షియల్, రిటైల్ సెగ్మెంట్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి చెందుతోందని అన్నారు.