స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కు భారీగా ఆదాయం వచ్చింది. 2022-23 ఫైనాన్సియల్ ఇయర్ లో 14,284 కోట్లను సేకరించింది. గతేడాది కంటే దాదాపు 2వేలకోట్లు అదనంగా వచ్చాయి. ప్రతి నెల వెయ్యికోట్లకు పైగానే ఇన్కమ్ రాబట్టింది. నిన్న మార్చి 31 తో 2022-23 ఫైనాన్సియల్ ఇయర్ ముగిసింది. ఈ ఫైనాన్సియల్ ఇయర్లో రిజిస్ట్రేషన్ శాఖకు బాగా కలిసొచ్చింది. అగ్రి, నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఇతర సేవల ద్వారా 14284.72 కోట్లను రాబట్టింది. మొత్తం 19.43 లక్షల డాక్యుమెంట్స్ రిజిస్టర్ అయ్యాయి. 

గతేడాదితో పోలిస్తే 2022-23 లో రిజిస్ట్రేషన్ శాఖకు దాదాపు 2 వేలకోట్లు అదనంగా వచ్చాయి. 2021-22 ఫైనాన్సియల్ ఇయర్లో 12, 364.59 కోట్లు వస్తే.. ఈసారి మాత్రం 14,284 కోట్లు వచ్చాయి. ఐతే సర్కార్ మాత్రం 2022-23 ఫైనాన్సియల్ ఇయర్ కు 15 వేలకోట్లను టార్గెట్ పెట్టింది. గతంలో కూడా ఈస్థాయిలో ఇన్కమ్ కాలేదు.. 2018-19 ఫైనాన్సియల్ ఇయర్లో ఆస్తుల రిజోస్ట్రేషన్లు ఇతర సేవల ద్వారా సర్కార్కు 6,612.74 కోట్లు వచ్చాయి. 

ఇక 2019-20 లో 7,061 కోట్లు, 2020-21 లో కరోనా ఎఫెక్ట్ తో 5,256.20 కోట్లకు పడిపోయింది రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం. ఇక మొదటిసారిగా 2021-22 ఫైనాన్సియల్ ఇయర్లో 10వేల కోట్లను క్రాస్ చేసింది రిజిస్ట్రేషన్ శాఖ. ఐతే ఇదే ఫైనాన్సియల్ ఇయర్లో సర్కార్ రెండు సార్లు భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం పెరిగింది.  సర్కార్ భూముల వ్యాల్యూ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిన తర్వాత రికార్డు స్థాయిలో ఇన్కమ్ నమోదవుతోంది. ప్రతి నెల రిజిస్ట్రేషన్ శాఖకు వెయ్యి కోట్లకు పైగానే ఆదాయం వచ్చి చేరుతుంది. 

2022-23 ఫైనాన్సియల్ ఇయర్ ప్రారంభం నుండి నిన్నటి ఇప్పటి వరకు నెలవారీగా నమోదైన ఆదాయ వివరాలు.. 

గతేడాది ఏప్రిల్ నెలలో 1350.57 కోట్లు,  మే నెలలో 1241 కోట్లు, జూన్ నెలలో 1230 కోట్లు, జులై నెలలో 1090కోట్లు, ఆగస్ట్ నెలలో 1144 కోట్లను రాబట్టింది. ఇక ఆగస్ట్ నెలలో 1144.24 కోట్లు, సెప్టెంబర్ నెలలో 1173.02 కోట్లు, అక్టోబర్ లో 1026.21 కోట్లు, నవంబర్ లో 1169.34 కోట్లు, డిసెంబర్ లో 1310.38 కోట్లు వస్తే.. ఇక ఈఏడాది జనవరి నెలలో 1094.93 కోట్లు, ఫిబ్రవరిలో 1072.31 కోట్లు, మార్చి నెలలో 1383.17 కోట్ల ఆదాయాన్ని సేకరించింది రిజిస్ట్రేషన్ శాఖ. 

ఐతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు 2022-23 ఫైనాన్సియల్ ఇయర్లో వచ్చిన ఆదాయంలో 70 శాతం ఆదాయం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలనుండి వచ్చిందంటున్నారు అధికారులు