
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కారుకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల ద్వారా రూ.12,987.26 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయమంతా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి చివరి నాటికి జరిగిన10.91 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరిందని అధికారులు వెల్లడించారు. గడిచిన11 నెలల్లో వచ్చిన రాబడిని పరిశీలిస్తే నెలకు సగటున రూ.940.40 కోట్లు నాన్ అగ్రికల్చర్రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చినట్లు తెలిపారు. మరో రూ.240 నుంచి రూ.250 కోట్లు అగ్రికల్చర్ ల్యాండ్స్రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చినట్లు చెబుతున్నారు. యావరేజ్‌గా నెలకు దాదాపు రూ.1,200 కోట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆదాయం వస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మార్చిలో మరో రూ.1,200 కోట్ల వరకు సర్కారుకు ఆదాయం వస్తుందని ఆఫీసర్లు అంటున్నారు.ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి ఈ శాఖ ఆదాయం రూ.15,600 కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.