రామనామంతో మార్మోగిన కొండగట్టు ఆలయం

రామనామంతో మార్మోగిన కొండగట్టు ఆలయం

హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి హనుమాన్ దీక్షపరులు, భక్తులు తరలిరావడంతో కొండగట్టు ఆలయం కిక్కిరిసిపోయింది. రామనామ జపంతో ఆలయం మార్మోగింది. దీక్ష విరమణ చేసేందుకు అర్ధరాత్రి నుంచి కొండపైకి చేరుకుంటున్నారు. మాల విరమణ చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు హనుమాన్ భక్తులు. కోనేరులో మురుగు నీరు ఉందని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాల విరమణ, కేశాఖండన, ప్రత్యేక దర్శనం టికెట్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు తప్ప సౌకర్యాలు కల్పించడంలో విఫలం అయ్యారని భక్తుల మండిపడుతున్నారు. కనీసం బొట్టు పెట్టుకోవడానికి చందనం కూడా ఏర్పాటు చేయలేదని ఆలయ అర్చకులతో వాగ్వాదానికి దిగారు భక్తులు. భక్తులు భారీగా తరలిరావడంతో పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.