
శ్రీరామ నవమి ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. సిటీలో జరగబోయే శోభా యాత్రపై పోలీసులు నజర్ పెట్టారు. పాతబస్తీలో జరిగే శోభా యాత్రకు భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. అయితే శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి స్టార్ట్ అయ్యే యాత్ర ...సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల దగ్గర ముగియనుంది. అయితే ట్రాఫిక్ జాం కాకుండా వెహికిల్స్ ను దారి మళ్లీంచేలా ప్లాన్ చేసింది పోలీస్ సిబ్బంది.
ఆసీఫ్ నగర్ నుంచి వచ్చే వెహికిల్స్.. బోయిగూడ కమాన్ నుంచి మల్లెపల్లి వైపు..బోయిగూడ కమాన్ నుంచి సీతారాంబాగ్ వెళ్లే వాహనాలను ఆగాపూరా వైపు మళ్లీస్తారు. ఆగాపురా, హబీబ్ నగర్ నుంచి దారుస్సలామ్ వైపుకు మళ్లీస్తారు. అఫ్జల్ గంజ్ నుంచి సిద్ధి అంబర్ బజార్ వైపుకు వెళ్లే వాహనాలు సాలార్ జంగ్ బ్రిడ్జ్ మీదుగా మళ్లీస్తారు. గౌలిగూడ చమన్ వచ్చే వాహనాలను జాంబాగ్ వైపుకు మళ్లీంచనున్నారు. అఫ్జల్ గంజ్ నుంచి MJ బ్రిడ్జ్ వైపుకు వెళ్లే వెహికిల్స్... మదీన, హైకోర్టు, సిటీ కాలేజ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇక పురానాపూల్ నుంచి వచ్చే వాహనాలను పేట్ల బురుజు , కుల్సంపూర, కార్వాన్ వైపునకు మళ్లిస్తారు. చాదర్ ఘాట్ నుంచి వచ్చే వెహికిల్స్ ను కాచిగూడ స్టేషన్ రోడ్ కు మళ్లిస్తారు. MJ బ్రిడ్జ్ నుంచి జుమ్మేరాత్ బజార్ వెళ్లే వాహనాలను సిటీకాలేజ్ వైపు... బ్యాంక్ స్ట్రీట్ వైపు నుంచి వచ్చే వాహనాలను DMHS వైపునకు మళ్లిస్తారు. చర్మాస్ నుంచి వచ్చే వెహికిల్స్..MJ మార్కెట్ వైపునకు మళ్లించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ స్ట్రీట్ , జీపీవో వైపు వాహనాలను అనుమతించబోమని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. కింగ్ కోఠి నుంచి వచ్చే వాహనాలను హనుమాన్ టేక్డీ వైపుకు అనుమతించబోమని తెలిపారు.