త్రివర్ణ మయమైన భైంసా..సైనికులకు మద్ధతుగా భారీ ర్యాలీ

త్రివర్ణ మయమైన భైంసా..సైనికులకు మద్ధతుగా భారీ ర్యాలీ

భైంసా, వెలుగు: ఆపరేషన్ సిందూర్​ పేరుతో పాకిస్తాన్​పై యుద్ధంలో సత్తాచాటిన భారత జవాన్లు, త్రివిధ దళాల  ధైర్య సాహసలను స్మరించుకుంటూ భైంసాలో a, కులమతాలకు అతీతంగా మంగళవారం భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు. స్థానిక లక్ష్మి వెంకటేశ్వరాలయంలో ఎమ్మెల్యే  పవార్ రామారావు పటేల్​తో పాటు పలువురు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది.

సైనికులు, భారత మాత వేషధారణలో చిన్నారులు ర్యాలీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్​తో ప్రపంచానికి భారత సైనిక సత్తా తెలిసిందన్నారు. యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. యాత్రలో డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారులు, రిటైర్ట్ ఉద్యోగులు, రిటైర్డ్ సైనికులు, ఆయా పార్టీల నేతలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

మోహన్​రావు పటేల్ ఆధ్వర్యంలో..

బోస్లే మోహన్​రావు పటేల్​ నేతృత్వంలోని మోహన్​రావు ప్రజా ట్రస్టు ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో తిరంగా యాత్ర చేపట్టారు. దారాబ్జీ జిన్నింగ్​ ఫ్యాక్టరీ నుంచి ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగింది.