
ప్రస్తుతం ఇండియాలో ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. కరోనా ముందువరకు కేవలం థియేటర్ సినిమాలతోనే ఎంటర్టైన్ అయ్యే ఆడియన్స్..ఓటీటీలు వచ్చాకా వెబ్ సిరీస్ ల కోసం ఎగబడుతున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా, జానర్ తో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. స్టార్స్ అండ్ మేకర్స్ కూడా వెబ్ సిరీస్ లు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొత్త కొత్త కంటెంట్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లను ఆడియన్స్ కు పరిచయం చేస్తున్నారు. దీంతో..ప్రేక్షకులు కూడా సినిమాల కన్నా వెబ్ సిరీస్ లే బెటర్ అనుకునే పరిస్థితికి వచ్చింది ప్రసెంట్ సిచువేషన్.
ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్‌లో ఒకటైన మహారాణి వెబ్ సీరీస్ ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో మహారాణి వెబ్ సిరీస్ ముందు వరసలో ఉంటుంది. బీహార్ రాజకీయాల చుట్టూ ఆసక్తిగా తిరిగే ఈ సిరీస్..ఫస్ట్ రెండు సీజన్లు సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాయి.
లేటెస్ట్గా మహారాణి వెబ్ సీరీస్ మూడో సీజన్(Maharani 3) ఓటీటీకి వచ్చేస్తుంది. 1990 ల నాటి బీహార్ రాజకీయాలను కళ్లకు కడుతున్న ఈ సిరీస్ మార్చి 7 నుంచి సోనీ లివ్(Sony LIV) లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మహారాణి వెబ్ సీరీస్ మూడో సీజన్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్లో బీహార్ రాజకీయాలు ఎంత వేడిగా ఉంటాయో..గెలవడం కోసం నాయకులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
మహారాణి రెండో సీజన్ క్లైమాక్స్లో జైలుకి వెళ్లే రాణీ భారతి..తిరిగి బీహార్లో అడుగు పెట్టి మళ్లీ కోల్పోయిన అధికారం కోసం ఏం చేసింది? పోయిన అధికారాన్ని చేజిక్కించుకుంటుందా లేదా అన్నది మూడో సీజన్లో చూపించనున్నారు మేకర్స్.
బాలీవుడ్ నటి హుమా ఖురేషీ(Huma Qureshi) రాణీ భారతి పాత్రలో అదరగొట్టిన విషయం తెలిసిందే.ఇప్పుడు మూడో సీజన్ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ మహారాణి వెబ్ సిరీస్ ను సుభాష్ కపూర్ క్రియేట్ చేయగా..సౌరభ్ భావే దర్శకత్వం వహించాడు. నందన్ సింగ్ మరియు ఉమాశంకర్ సింగ్ లతో కలిసి సుభాష్ కపూర్ ఈ సిరీస్ కుస్టోరీని అందించాడు. వాస్తవానికి పొలిటికల్ వార్ బయట ఎలా ఉందో..ఇలాంటి టైములో మహారాణి వెబ్ సీరిస్ వస్తుండటంతో ఎలాంటి ప్రకంపనలు క్రియేట్ చేస్తుందో అని కొంతమంది రాజకీయ నాయకుల్లో అలజడి మొదలైంది.