
గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నాచారంగుట్ట లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని ఆఫీసర్లు, ఆలయ సిబ్బంది మంగళవారం లెక్కించారు. గత మూడు నెలలకు సంబంధించి ప్రధానాలయంతో పాటు ఉప ఆలయాలలోని హుండీలను తెరిచి భక్తుల సమక్షంలో లెక్కించగా ఆదాయం రూ. 21,76,954- వచ్చినట్టు ఆలయ ఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు.