
కేరళలో కుండపోత వర్షాల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్ సమీపంలోని మెప్పాడిలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. అర్థరాత్రి రెండు సార్లు కొండ చరియలు విరిగిపడ్డాయి. 400లకు పైగా కుటుంబాలపై ప్రభావం పడినట్లు తెలిపారు. ఈఘటనలో ఏడుగురు మృతి చెందారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. వర్షాలు భారీగా పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కల్గుతోంది. దీంతో ఎయిర్ ఫోర్స్ మిగ్ 17 హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.
ఈ ప్రమాదంపై స్పందించిన సీఎం పినరయి విజయిన్ సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఘటనా స్థలానికి వెళ్తారని చెప్పారు ఎమర్జెన్సీ కోసం నేషనల్ హెల్త్ మిషన్ - కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.రెండు హెల్ప్ లైన్లు నంబర్లు 9656938689, 8086010833 ద్వారా అధికారులను సంప్రదించవచ్చు.