
డిఫరెంట్ స్ర్కిప్ట్‌లను సెలెక్ట్ చేసుకోవడంతో పాటు తనదైన యాక్టింగ్‌తో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. వాటిలో మహేష్ అనే కొత్త దర్శకుడితో ఓ మూవీ చేస్తున్నాడు. వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను నిన్న రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘హంట్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గన్స్ డోంట్ లై అనేది క్యాప్షన్. గన్, బుల్లెట్స్, బేడీలు, ఈఫిల్ టవర్ మధ్యలో సుధీర్ బాబు ముఖం కనిపించేలా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. ఇందులో సుధీర్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఎవరి కోసం వేట మొదలుపెట్టాడు. అసలేమైంది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ కూడా పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్నాడు.
టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన సుధీర్ బాబు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేశాం. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది’ అని చెప్పారు. సుధీర్ బాబుకి ఇది 16వ సినిమా. మంజుల, కబీర్ సింగ్, గోపరాజు రమణ, చిత్రా శుక్ల ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. అలాగే హర్ష వర్ధన్ డైరెక్షన్‌లో ‘మామా మశ్చీంద్ర’ మూవీలో కూడా సుధీర్ బాబు నటిస్తున్నాడు.