గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి... కరీంనగర్ జిల్లా ముత్తారంలో ఘటన

గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి... కరీంనగర్ జిల్లా ముత్తారంలో ఘటన

శంకరపట్నం, వెలుగు: కరీంనగర్  జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు 24 గంటల వ్యవధిలో చనిపోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన కనకం రాజమల్లు(80), రాజవ్వ(73) దంపతులు. వీరు గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

బుధవారం భార్య రాజవ్వ అనారోగ్యంతో చనిపోగా, భర్త రాజమల్లు గురువారం మృతి చెందాడు. 24 గంటల వ్యవధిలో వృద్ధ దంపతులు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. చివరి వరకు అన్యోన్యంగా ఉండేవారని గ్రామస్తులు తెలిపారు.