ఇటుకతో కొట్టి రెండో భార్యను చంపిన భర్త.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘటన

ఇటుకతో కొట్టి రెండో భార్యను చంపిన భర్త.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘటన

చేవెళ్ల, వెలుగు: రెండో భార్య కాపురానికి దూరంగా ఉంటుదన్న కోపంతో ఆమెను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వెంకన్నగూడ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. వెంకన్నగూడ‌‌ గ్రామానికి చెందిన వానరాసి జంగయ్య నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు భార్యలు. రెండో భార్య రజిత(30)తో రెండేళ్లుగా మనస్పర్ధలు ఉండడంతో ఆమె దూరంగా ఉంటోంది. 

సోమవారం ఉదయం ఆమెను గ్రామానికి పిలిపించి గ్రామ పెద్దల  సమక్షంలో మాట్లాడారు. కాపురానికి వచ్చేందుకు ఆమె నిరాకరించింది. సాయంత్రం జంగయ్య, రజిత కలిసి గ్రామ సమీపంలో మద్యం సేవించారు. తదనంతరం జంగయ్య చున్నీని రజిత మెడకు ఉరేశాడు. చనిపోయిందో లేదోనని సిమెంట్ ఇటుకతో తలపై కొట్టి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి మొదటి భార్యకు షేర్ చేశాడు. పోలీస్​స్టేషన్​కు వెళ్లి  లొంగిపోయాడు. హత్యలో మొదటి భార్య ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.