భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్ ..మహబూబాబాద్ జిల్లాలో ఘటన

భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్ ..మహబూబాబాద్ జిల్లాలో ఘటన

గూడూరు, వెలుగు: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ గిరిధర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. గూడూరు మండలం కోబల్ తండాకు చెందిన గుగులోతు మంగీలాల్(35) భార్యతో గొడవపడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఈనెల 17న భార్య వద్దకు వెళ్లి ఇంటికి రమ్మని భర్త అడిగాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించిన తర్వాతే వస్తానని తేల్చి చెప్పింది. 

దీంతో మనస్తాపం చెందిన మంగీలాల్ అదేరోజు సాయంత్రం పురుగుల మందు తాగాడు.  కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. మృతుడి తల్లి చాందీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ ఐ తెలిపారు.