సెల్‌కు దగ్గరగా.. వైఫ్‌కు దూరంగా…

సెల్‌కు దగ్గరగా.. వైఫ్‌కు దూరంగా…

లైఫ్‌ పార్ట్​నర్‌ కంటే మొబైల్‌‌కే ప్రయారిటీ
భర్తలపై ఎక్కువమంది కంప్లయింట్ ఇదే..
భార్య కంటే స్మార్ట్ ఫోన్ కే భర్తల ప్రయారిటీ
‘గోద్రెజ్‍ ఇంటిరియో’సర్వేలో వెల్లడి

విక్రమ్ ఓ ప్రైవేట్‍కం పెనీలో మేనేజర్‍. రోజంతా మొబైల్ కు అతుక్కుపోవడంతో ఆయన భార్య సహించలేకపోయింది. పెళ్లయిన రెండేళ్లకే విడాకులు కావాలని కోరింది. ఇంట్లో తనకు సమయం కేటాయించడని, వీకెండ్‌లో రెస్టారెంట్‌కు వెళ్లినా ఫోన్ తోనే గడిపేస్తాడని కోర్టులో ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడీ సమస్యను చాలా జంటలు ఎదుర్కొంటున్నా యని ‘గోద్రెజ్‍ఇంటిరియో’ సర్వే స్పష్టం చేసింది. దూరంగా ఉన్న మనుషులను దగ్గరగా చేసే సెల్ ఫోన్ .. ఒకే గదిలో ఉన్న ఇద్దరిని దూరం చేస్తోందని పేర్కొంది.

వాస్తవానికి స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వంటివి మానవ జీవితాలలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చాయి. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్న వ్యక్తులనైనా కలుపుతోంది. కానీ అదే సమయంలో ఒకే గదిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను సైతం దూరం చేస్తోంది. చాలా మంది నిత్యం స్మార్ట్ ఫోన్‌కి పరిమితమై బంధాలను సైతం దూరం చేసుకుంటున్నారు. వాస్తవ సంభాషణలు పోయి, ఇప్పుడు వర్చు వల్ సంభాషణలు కొనసాగుతున్నయి. కానీ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడుతుండడంతో బానిసలుగా మారుతూ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. భార్త, భర్త, స్నేహితులు, కుటుంబసభ్యుల బంధాలను దెబ్బతియడానికి అవే కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు తమ భార్యకు ఇచ్చే సమయం కంటే స్మార్ట్ ఫోన్‌‌కే ఎక్కువ కేటాయిస్తున్నారని ఇటీవల గోద్రెజ్ ఇంటీరియో అనే సంస్థ వెల్లడించింది. మితిమీరిన టెక్నాలజీ బంధాలు తెగేందుకు కారణమవుతోందని ఆ సంస్థ పేర్కొంది. ‘మేక్ స్పేస్ ఫర్ లైఫ్’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో 13 సిటీల్లో సుమారు 50 శాతం మంది తమ భాగస్వాముల కంటే స్మార్ట్ ఫోన్ కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని వెల్లడించారు. ముంబై, ఛండీగఢ్, పాట్నా, పుణే, లక్నో, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, కాన్పుర్ పట్టణాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగాలు నిర్వహించే జంటల నుంచి 1800 శాంపిల్స్ తీసుకొని వారిపై అధ్యయనం చేశారు. దాదాపు 56.7 శాతం మంది స్మార్ట్ ఫోన్‌కి ఇచ్చిన సమయం భార్యకు ఇస్తలేరని వెల్లడైంది. దీనిలో హైదరాబాద్ సిటీవాసులు కూడా ఉండడం ఆందోళన కలిగించే అంశం.

స్మార్ట్ ఫోన్‌కే అంకితమైన ఉద్యోగస్తులు
విక్రమ్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా డు. మేనేజర్ స్థాయి ఉద్యోగి కావడంతో నిత్యం బిజీబిజీ. భార్య కూడా అతని పరిస్థితిని అర్థం చేసుకొని నిత్యం సహకరిస్తూ వస్తుండేది. కానీ సెలవు దినంలో కూడా అతను నిత్యం స్మార్ట్ ఫోన్‌లకు అంకితం కావడంతో పెళ్లైన రెండేళ్లకే ఆమె విడాకులు కావాలని కోరింది. వీకెండ్ సమయంలో రెస్టారెంట్‌కి వెళ్లినా.. స్మార్ట్ ఫోన్‌కి అంకితమైన తన భర్త తాను చెప్పింది ఏమీ పట్టించుకోవడం లేదని కోర్టులో తన ఆవేదనని వ్యక్తం చేసింది. ఇలా ఈవిధంగా ఈ ఒక్క జంటనే కాదు. సిటీలో చాలా మంది ఉద్యోగుల్లో ఈ విధమైన పరిస్థితులు ఎదురవుతున్నయి. చాలా మంది భార్యాభర్తలు ఫేస్ బుక్ , వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ అప్ డేట్ చేయడంలో బిజీగా ఉంటున్నారు ఇరువురు సరదాగా గడిపేందుకు సమయం లేకుండా ఉంటున్నారు. దీంతో భార్యాభర్తల మధ్య విబేధాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నట్లు గోద్రేజ్ అధ్యయనంలో గుర్తించారు. మితిమీరిన ఫోన్ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నరు.మొబైల్స్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మెదడులో కణాలు పెరిగి ప్రాణాం తకమైన ‘గ్లియోమా’ అనే కణతులు ఏర్పడి, ఫోన్లో బ్యాటరీ అయిపోయినప్పుడు లేదా నెట్ వర్క్​కవరేజ్ లేనప్పుడు మిమ్మల్ని ఆత్రుతకు గురి చేస్తుంది. ఫోన్ ఎక్కువ సేపు వాడడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది
మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకంతో మెదడులో ప్రాణాంతకమైన గ్లియోమా అనే కణితులు ఏర్పడుతాయి.
రేడియేషన్ ఎక్కువైనప్పుడు బ్రెయిన్ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
– డాక్టర్ సాయిరాం , ఎంఎన్‌జే హాస్పి టల్

బంధాలపై ప్రభావం
స్మార్ట్ ఫోన్ కే ఎక్కువ సమయం కేటాయించడం వలన బంధాలు దూరమవుతున్నయి. ఉద్యోగస్తుల్లో ఎక్కువ మంది ఈ తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నరు. చాలా మంది ఇదే సమస్యలతో బాధపడుతున్నరు.
– అనిల్ మాథుర్ చీఫ్ ఆపరేటింగ్, ఆఫీసర్ గోద్రేజ్ ఇంటీరియో

For More News..

లేడీ కండక్టర్‌పై యాసిడ్ దాడి