పెళ్లైన నెలకే భార్యను గొంతు కోసి చంపిన భర్త

V6 Velugu Posted on Sep 26, 2021

హైదరాబాద్‎: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన నూతన వధువు.. పెళ్లైన నెలకే కన్నుమూసింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‎లో జరిగింది. బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌‎కు చెందిన కిరణ్ అనే యువకుడికి సుధారాణి (22)తో నెల రోజుల క్రితం పెళ్లైంది. పెళ్లి తర్వాత భార్య మీద అనుమానం పెంచుకున్న కిరణ్.. దారుణానికి ఒడిగట్టాడు. శనివారం అర్ధరాత్రి భార్య గొంతు కోసి చంపాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు.. కిరణ్‎ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. భార్య మీద అనుమానంతోనే కిరణ్ ఈ హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

నేడు ఏపీలోకి గులాబ్ తుఫాన్! తెలంగాణపై ఎఫెక్ట్..

డ్యూటీకి రాకపోతే రూ.300 ఫైన్

Tagged Hyderabad, murder, newly married couple, husband killed his wife, Bachupalli

Latest Videos

Subscribe Now

More News