వైద్యుల నిర్లక్ష్యం.. ఆర్టీసీ డ్రైవర్ల రూల్స్.. ఫలితం భార్య శవంతో బస్టాండ్‌లో భర్త

వైద్యుల నిర్లక్ష్యం.. ఆర్టీసీ డ్రైవర్ల రూల్స్.. ఫలితం భార్య శవంతో బస్టాండ్‌లో భర్త

భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన భార్య శవాన్ని బస్సులోకి ఎక్కించుకోవాలంటూ డ్రైవర్లను బతిమిలాడాడు ఓ భర్త. ఈ ఘటన అక్కడున్న వారందరిచేత కంటతడి పెట్టించింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన రమ గత కొన్ని ఏళ్లుగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంది. ఎప్పటిలాగే భర్త సమ్మయ్యతో కలిసి రమ శనివారం భద్రాచలంలోని ప్రభుత్వాస్పత్రికి వైద్యం కోసం వచ్చింది. అయితే ఆస్పత్రిలో సిబ్బంది లేరని.. రేపు ఆదివారం హలిడే కాబట్టి సోమవారం ఆస్పత్రికి రావాలని వైద్య సిబ్బంది వారికి చెప్పారు. దాంతో సమ్మయ్య తన భార్యను తీసుకొని ఇంటికి వెళ్లడానికి భద్రాచలం బస్టాండ్‌కు చేరుకున్నాడు. అప్పటికే వ్యాధి ముదిరి ఉన్న రమ బస్టాండ్ ఆవరణలోనే ప్రాణం విడిచింది. చేతిలో చిల్లిగవ్వ లేక ప్రయాణ ఖర్చులే భారంగా ఉన్న సమ్మయ్య.. తన భార్య మృతదేహాన్ని తీసుకెళ్లమని డ్రైవర్లను ఎంతగానో బతిమిలాడాడు. అయినా డ్రైవర్లు మాత్రం రూల్స్ ఒప్పుకోవని ఎవరూ బస్సులోకి ఎక్కించుకోలేదు. దాంతో సమ్మయ్య తన భార్య శవం వద్ద కూర్చొని కన్నీరుమున్నీరయ్యాడు.
వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే తన భార్య ఇలా అకాలమరణం చెందిందని సమ్మయ్య అంటున్నాడు. తన భార్యకు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహించి.. ఆమె మృతికి కారకులైన వైద్య సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమ్మయ్య కోరుతున్నాడు.

For More News..

అయోధ్యలో నిర్మించబోయే మసీదు, ఆస్పత్రి నమూనాలివే..

ఆమెకు 15.. అతనికి 16.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని సూసైడ్