
హుస్నాబాద్, వెలుగు: హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కుళ్లిన ఆహార పదార్థాలు, పరిశుభ్రత లేకపోవడం, నిషేధిత సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్న షాపులకు జరిమానా విధించారు. మైసూర్ బేకరీకి రూ.1000, వీనస్ మెస్ కి రూ.1000-, బావార్చి రెస్టారెంట్ కి రూ.10,000-, దావత్ రెస్టారెంట్ కి రూ.20,000, మస్తీ కిచెన్ కి రూ. 5000, స్వాగత్ రెస్టారెంట్ కి రూ.2000, రాజు గారి బిర్యానీ రూ.10,000, రిషి బిర్యానీ సెంటర్ కి రూ.2000 జరిమానా విధించినట్లు కమిషనర్ తెలిపారు.
ప్రతి ఒక్కరు నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించాలని సూచిస్తూ, నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, బిల్ కలెక్టర్ సతీశ్, జవాన్లు సారయ్య , ప్రభాకర్, మున్సిపల్ సిబ్బంది శేఖర్, వనాకర్, సాగర్ పాల్గొన్నారు.