22 రౌండ్లలో హుజురాబాద్ కౌంటింగ్

22 రౌండ్లలో హుజురాబాద్ కౌంటింగ్

హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. నవంబర్ 2న ఉదయం 8 గంటలకు  కరీంనగర్  SRR  డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ మొదలు కానుంది. మొదటి అరగంట  పాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించనున్నారు. మొత్తం  753 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు రెండు హాల్స్ లో కౌంటింగ్ జరగనుంది. ఒక్క హాళ్లో 7 టేబుళ్ల చొప్పున ప్రతి రౌండ్ కు14 టేబుల్స్ పై 14 ఈవీఎలను లెక్కిస్తారు.  మొత్తం 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుంది.