- కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్
ఎల్కతుర్తి(కమలాపూర్), వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్ సూచించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్, కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం వేర్వేరుగా ప్రారంభించారు. కమలాపూర్ మండలం ఉప్పల్ లో కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్, కమలాపూర్ లో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఝాన్సీరాణి ప్రారంభించారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంతోపాటు దామెర, గోపాల్‌పూర్, చింతలపల్లి, సూరారం, దండేపల్లి, కేశవాపూర్ లో ఎల్కతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినె సంతాజీ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. కమలాపూర్ మండలం ఉప్పల్ లో కొనుగోలు కేంద్రంలో ప్రణవ్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు.
