ఇండ్ల స్థలాల సాధన కోసం హుజురాబాద్ జర్నలిస్టులు..ఐదో రోజుకు చేరిన దీక్ష

ఇండ్ల స్థలాల సాధన కోసం హుజురాబాద్ జర్నలిస్టులు..ఐదో రోజుకు చేరిన దీక్ష

హుజురాబాద్, వెలుగు: ఇండ్ల స్థలాల సాధన కోసం హుజురాబాద్ జర్నలిస్టులు చేస్తున్న దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. గురువారం నల్ల బెలూన్లు ఎగరేసి తమ నిరసన తెలిపారు. జర్నలిస్టుల ఉద్యమానికి బీఎస్పీ మద్దతు ప్రకటించింది. హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరానికి వచ్చిన బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె ప్రశాంత్ గౌడ్, ఆ పార్టీ నాయకులు, ముదిరాజ్ సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య సంఘీభావం తెలిపారు. 

ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. అర్హులైనవారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులంతా ఏకతాటిపై నిలిచి పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు, బీఎస్పీ నాయకులు  మహేందర్, మల్లేశ్, ప్రభాకర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.