
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి హాస్పిటల్ కు వెళ్ళి చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి పేరెంట్స్ ఖర్జూర పండ్లు ఇచ్చారని.. ఆ విద్యార్థి అతని స్నేహితులైన మరో పదిమందికి ఖర్జూర పండ్లు ఇచ్చాడని చెప్తున్నారు. అవి తిన్న విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెప్పారు. ఎక్స్ పైర్ అయిన ఖర్జూర పండ్లు తినడంతోనే అస్వస్థతకు గురై ఉంటారని డాక్టర్లు చెప్తున్నారు.