ఆపరేషన్ సిందూర్..కొత్త వీడియోను రిలీజ్ చేసిన ఆర్మీ

ఆపరేషన్ సిందూర్..కొత్త వీడియోను రిలీజ్ చేసిన ఆర్మీ

ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన మరో కొత్త వీడియోను ఇండియన్ ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ విడుదల చేసింది. పక్కా ప్రణాళిక, శిక్షణతో అమలు చేశాం.. న్యాయం జరిగిందంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ కు ఓ గుణపాఠం అని దశాబ్దాలుగా అది నేర్చుకోని పాఠం అని ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ షేర్ చేసిన వీడియోలో భద్రతా సిబ్బంది చెబుతున్న వాయిస్ వినపడుతోంది. 

ALSO READ | Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్..అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరెస్ట్

పహల్గాం దాడి తర్వాత ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. మే 7న ప్రారంభించిన ఈ ఆపరేషన్ లో భూతల, వాయు, సముద్ర దళాల ద్వారా మూకుమ్మడి అటాక్ చేసింది. కేవలం మూడురోజుల్లో పాకిస్తాన్ తగిన గుణపాఠం చెప్పింది. భారత్ దెబ్బకు దిగొచ్చిన పాక్.. కాల్పుల విరమణ, సైనిక చర్యలు ఆపాలని కోరింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. 

#StrongAndCapable#OpSindoor

Planned, trained & executed.

Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon

— Western Command - Indian Army (@westerncomd_IA) May 18, 2025

ఇదిలావుంటే భారత్, పాకిస్తాన్ మధ్య డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) సమావేశం ఆదివారం జరగాల్సి ఉండగా అది జరగలేదని ఇండియన్ ఆర్మీ ఆదివారం(మే 18) తెలిపింది.  రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోందని తెలిపింది.మే 12న రెండు దేశాల DGMOలు శత్రుత్వాలను ముగించి, రెండు అణ్వస్త్ర పొరుగు దేశాల మధ్య కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.