
పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదంపై తలపెట్టిన ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హర్యానాకు చెందిన ప్రొఫెసర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని అశోకా యూనివర్సిటీలో ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్ విభాగం డీన్ అలీఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీకి యూత్ వింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అలీఖాన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు హర్యానా రాష్ట్ర మహిళా కమిషన్ కూడా అలీఖాన్ వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది.
కల్నర్ ఖురేషీకి మితవాద మద్దతుదారులనుంచి ప్రశంసలు బాగానే వచ్చాయి. అదేవిధంగా మూకదాడి, ఏకపక్షంగా ఇళ్లను కూల్చివేత బాధితుల కోసం ఆ వ్యక్తులు నిలదీయాలని తన సోషల మీడియా పోస్టులో అలీఖాన్ అన్నారు.అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అలీఖాన్ అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యల చేశారని బీజేపీ వింగ్ ఇచ్చి ఫిర్యాదుతో ప్రొఫెసర్ ను అరెస్టు చేసినట్లు హర్యానా పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ (ACP) అజీత్ సింగ్ ధృవీకరించారు.
అయితే అలీఖాన్ అరెస్టు ఆన్‌లైన్ లో చర్చకు దారితీసింది. అనేక మంది రాజకీయ నేతలు, విద్యావేత్తలు ప్రొఫెసర్‌కు మద్దతు ప్రకటించారు. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ చర్యను ఖండించారు. ప్రొఫెసర్ అలీఖాన్ దేశానికి వ్యతిరేకంగా గానీ, స్త్రీ లపై ద్వేషంతోగానీ పోస్టు చేయలేదని అన్నారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు వ్యక్తులను లక్ష్యంగా పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు అలీఖాన్ అరెస్ట్ తో హర్యానా పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని.. కేవలం బీజేపీ కార్యకర్త ఫిర్యాదుతో హర్యానా పోలీసులు చర్యలు తీసుకున్నారని విమర్శిస్తూ ఓవైసీ ట్వీట్ చేశారు. సీపీఐ(ఎం) పోలిబ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ కూడా ఈ అరెస్టును ఖండించారు. ఇది "దిగ్భ్రాంతికరమైనది ఘటన " అని అన్నారు.
మరోవైపు హర్యానా మహిళ కమిషన్ కూడా నోటీసులు ఇచ్చింది. మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని అలీఖాన్ కు నోటీసులిచ్చాం.. అయినా ఆయన స్పందించలేదు. జాతి నిర్మూలన , వంచన అనే పదాలను ఆయన పదే పదే వాడారు.. ఆ పదాలు వాస్తవాలను తప్పుగా సూచించాయని మహిళా ప్యానెల్ చీఫ్ రేణు భాటియా అన్నారు. అలీఖాన్ వ్యాఖ్యలు సాయుధ దళాలకు దురుద్దేశపూర్వకంగా మతపరమైన ఆపాదించాయని మతపరమైన అశాంతిని ప్రేరేపించాయని అన్నారు. అంతర్గత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు అలీఖాన్ వ్యాఖ్యలు ప్రయత్నించాయని మహిళా కమిషన్ తన నోటీసులు తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అలీఖాన్ కమిషన్ ముందు హాజరై కనీసం విచారం వ్యక్తం చేస్తాడని ఊహించాం.. కానీ విచారణకు హాజరు కాలేదన్నారు.
మహిళా కమిషన్ తన అధికార పరిధిని దాటి పోస్టులను తప్పుగా అర్థం చేసుకుని వాటి అర్థాన్ని తారుమారు చేయడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది" అని అలీఖాన్ ట్వీట్ చేశారు.మరోవైపు అలీఖాన్ వ్యాఖ్యలు అతని వ్యక్తిగతం.. యూనివర్సిటీకీ సంబంధం లేదు విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.