
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దురదృష్టం వెంటాడుతుంది. లీగ్ దశలో మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోవిడ్-19 కారణంగా లక్నో సూపర్ జయింట్స్ తో జరగబోయే మ్యాచ్ నుంచి దూరమయ్యాడు. ఈ విషయాన్ని SRH ప్రధాన కోచ్ డేనియల్ వెట్టోరి అధికారికంగా ప్రకటించాడు. వెట్టోరి విలేకరులతో మాట్లాడుతూ.. " హెడ్ కు కోవిడ్-19 సోకింది. దురదృష్టవశాత్తు అతను జట్టుతో కలిసి ప్రయాణించలేకపోయాడు. అతను పూర్తిగా కోలుకుని జట్టులో చేరడానికి అనుమతి పొందిన తర్వాత మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం". అని వెటోరి తెలిపాడు.
2025 ఐపీఎల్‌లో హెడ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గత సీజన్‌లో అద్భుతంగా రణయించి సన్ రైజర్స్ ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించిన హెడ్.. ఈ సీజన్ లో నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో కేవలం 281 పరుగులు మాత్రమే చేశాడు. 156.11 స్ట్రైక్ రేట్‌తో పర్వాలేదనిపించినా యావరేజ్ మాత్రం 28 మాత్రమే ఉంది. వీటిలో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు ట్రావిస్ హెడ్ ను రూ. 14 కోట్లకు సన్ రైజర్స్ రిటైన్ చేసుకుంది. హెడ్ లేకపోవడంతో అభిషేక్ శర్మతో ఓపెనర్ గా ఎవరు బరిలోకి దిగుతారో ఆసక్తికరంగా మారింది.
ఈ సీజన్ లో సన్ రైజర్స్ విషయానికి వస్తే ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. 11 మ్యాచ్ ల్లో కేవలం మూడు మాత్రమే గెలిచింది. 7 మ్యాచ్ ల్లో ఓడిపోగా ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు. ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టు మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. సోమవారం (మే 19) లక్నో సూపర్ జయింట్స్ పై.. మే 23 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై.. మే 25 కోల్ కతా నైట్ రైడర్స్ పై మ్యాచ్ లు ఉన్నాయి.
Travis Head tested positive for COVID19.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2025
- He's unlikely to play Vs LSG. pic.twitter.com/hMOZFH86Mm