IND vs ENG: ఇంగ్లాండ్ సిరీసే టార్గెట్: కఠిన డైట్ చేస్తూ 10 కేజీలు తగిన టీమిండియా క్రికెటర్

IND vs ENG: ఇంగ్లాండ్ సిరీసే టార్గెట్: కఠిన డైట్ చేస్తూ 10 కేజీలు తగిన టీమిండియా క్రికెటర్

టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు సమాచారం. ఇంగ్లాండ్ టూర్ లో భాగంగా జూన్ 20 నుంచి 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్ క్రికెటర్లు టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో సర్ఫరాజ్ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించేందుకు పోరాడుతున్నాడు. ఈ వారం చివర్లో భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారు. సర్ఫరాజ్ ఈ సిరీస్ లో చోటు దక్కించుకోవడానికి తన ఫిట్ నెస్ అడ్డురాకూడదని భావిస్తున్నాడు.

ALSO READ | కోహ్లీని కన్విన్స్ చేయడానికి ట్రై చేశా.. కానీ: విరాట్ రిటైర్మెంట్‎పై సంజయ్ బంగర్ రియాక్షన్

ఈ ముంబై బ్యాటర్ కఠినమైన డైట్ ప్లాన్ చేసి 10 కిలోల బరువు తగ్గాడు. అతను ఫిట్ గా ఉండటానికి ఉడికించిన కూరగాయలు తింటున్నాడట. చికెన్ పూర్తిగా మానేసి ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తున్నాడు. ఫిట్ నెస్ తో పాటు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రోజుకు రెండు పూటలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆఫ్-స్టంప్ బయట పడిన బంతులని ప్రాక్టీస్ చేస్తూ బిజీగా మారాడు. శుక్రవారం (మే 16) ఇండియా ఎ జట్టులో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు. మే 30 నుండి ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ రెండు టెస్టుల్లో రాణిస్తే సర్ఫరాజ్ ప్లేయింగ్ 11 లో ఛాన్స్ దక్కించుకోవచ్చు. 

సర్ఫరాజ్ తన చివరి టెస్టును గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XIతో ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. దీనికి తోడు గాయం కారణంగా 2024-25 రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. 2024 ఫిబ్రవరి 15 రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటాడు. ఓవరాల్ గా ఆరు టెస్టుల్లో ఇండియా తరపున 371 పరుగులు చేశాడు.

జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ వేదికగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ 2025-27 సైకిల్ లో టీమిండియాకు ఇదే తొలి సిరీస్. ఈ సారి ఇండియా ఎక్కువగా యంగ్ ప్లేయర్లతోనే బరిలోకి దిగబోతుంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ లయన్స్ తో యంగ్ ఇండియా రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. హెడ్డింగ్లేలో జూన్ 20 న తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మిగతా నాలుగు టెస్టులకు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికలు కానున్నాయి. 2021-22 చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఈ సిరీస్ 2-2 తో సమంగా ముగిసింది.