చైనా మాంజా అమ్ముతున్న దుకాణాలపై పోలీసుల దాడులు

చైనా మాంజా అమ్ముతున్న దుకాణాలపై పోలీసుల దాడులు

చైనా మాంజాలు అమ్ముతున్న షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. రాచకొండ సీపీ ఆదేశాల మేరకు మీర్ పేటలోని పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. మాంజా కారణంగా వాహనాదారులు, పక్షులకు చుట్టుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని చైనా మాంజ  అమ్ముతున్న వ్యాపారస్తులపై దాడులు నిర్వహించిన పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి భారీగా మాంజా స్వాధీనం తీసుకున్నారు.

కాగా, సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. రంగురంగుల గాలిపటాలతో చిన్నారులు సంబరాలు జరుపుకునే పండుగ. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా మార్కెట్లో రంగురంగుల పతంగులు సందడి చేస్తున్నాయి. సందర్భంగా మార్కెట్లలో విభిన్న రకాల గాలిపటాలు దర్శనమిస్తాయి. ప్రజలకు సంక్రాంతి సమయంలో గాలిపటాలను ఎగురవేయడంపై ఉండే క్రేజ్ తో ప్రతి ఏడు హైదరాబాద్ వంటి మహానగరాలలో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.