చంద్రబాబుకు మద్దతుగా ధర్నా చేసిన ఐటీ ఉద్యోగులకు షాక్

చంద్రబాబుకు మద్దతుగా ధర్నా  చేసిన ఐటీ ఉద్యోగులకు షాక్

చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్ సైబర్ టవర్ దగ్గర ధర్నా చేస్తున్న వారికి షాక్ తగిలింది. చంద్రబాబుకు  సంఘీభావం పలుకుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఐటి కంపెనీలు నోటీసులు జారీ చేసింది. ఉద్యోగులకు.. కంపెనీల ద్వారా పోలీసులు మెయిల్స్ పంపుతున్నారు. చంద్రబాబు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ నోటీసుల్లో హెచ్చరించారు. 

చంద్రబాబుకు అరెస్ట్‌కు మద్దతుగా కొంత మంది  ఐటీ ఉద్యోగులు  ఆందోళ‌న‌లు చేశారు. హైటెక్ సిటీ వ‌ద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఐటీ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐటీ ఉద్యోగులు ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో సైబర్ టవర్ వద్ద ఎలాంటి ఆందోళనలు చేయవద్దని పోలీసులు పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు తమ కార్యాలయాల్లోకి వెళ్లిపోవాలంటూ సూచించారు. కానీ కొంత మంది ఉద్యోగులు మాత్రం వినలేదు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఐటీ కంపెనీల ద్వారా ఆ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. 

Also Read :- బాబును ఓదార్చాడా... సెటిల్ మెంట్ మాట్లాడుకున్నాడా: మాజీ మంత్రి పేర్ని నాని