అలర్ట్: హైదరాబాద్లో దంచికొడుతోన్న వర్షం

అలర్ట్:  హైదరాబాద్లో దంచికొడుతోన్న వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహీల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పంజాగుట్ట, యూసఫ్ గూడ,అమీర్ పేట, కూకట్ పల్లి, ఖైరతాబాద్,చందానగర్,  మియాపూర్, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్ర, కొంపల్లి, చింతల్, షాపూర్, హిమయాత్ నగర్, సికింద్రాబాద్, బోయినపల్లి, కొంపల్లి,దూలపల్లి,గండిమైసమ్మ, బాహుదూర్ పల్లి,మల్లంపేట్, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారంలో వర్షం దంచికొడుతోంది.  రహదారులన్నీ జలయమం అయ్యాయి. . భారీగా వరద నీరు వచ్చి చేరింది. రాత్రి 10 గంటల నుండి  1 వరకు మూడు గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట,రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్ వనపర్తి  జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తారు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.  ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.