కేంద్ర పర్యావరణ కమిటీ లో హైదరాబాద్ వాసి డాక్టర్ సరిత

కేంద్ర పర్యావరణ కమిటీ లో హైదరాబాద్ వాసి డాక్టర్ సరిత
  • కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు

న్యూఢిల్లీ, వెలుగు:  హైదరాబాద్ కు చెందిన పర్యావరణ నిపుణురాలు డాక్టర్ సరితకు కేంద్ర ప్రభుత్వ కీలక కమిటీలో చోటు లభించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఎక్స్ పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) మెంబర్ గా ఆమె నియమితులయ్యారు. సోమవారం కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులిచ్చింది.  మొత్తం 13 మందితో కూడిన ఈ కమిటీకి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ డా. రామ్​కుమార్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. అలాగే డాక్టర్ సరిత సజ్జ, ఐఎఫ్ఎస్ అధికారులు (రిటైర్డ్) మోనిష్ ముల్లిక్, చారు దత్త సింగ్, పి. బినీషతో పాటు 12 మందిని మెంబర్లుగా కేంద్రం నియమించింది. 

డాక్టర్ సరిత రెండు దశాబ్దాలకుపైగా పర్యావరణ రంగంలో పని చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ గ్రీన్ కోర్ ప్రాజెక్టు ఆఫీసర్, పర్యావరణ అధ్యాపకురాలుగా పనిచేయడంతో ఈ రంగంలో వివిధ రకాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు పని చేస్తూనే మరోవైపు ఈ రంగంలో డాక్టరేట్ ను కూడా సాధించారు. ప్రస్తుతం ఎస్ఈఏసీ సభ్యురాలిగా ఉన్నారు.