
గండిపేట, వెలుగు: ట్రాన్స్ఫార్మర్ పెట్టేందుకు లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. బండ్లగూడ జాగీరు పరిధిలోని ఏఆర్సీకే అపార్ట్మెంట్లో కొత్త ట్రాన్స్ఫార్మర్నిర్మించడానికి హిమాయత్‌సాగర్ సెక్షన్లో అసిస్టెంట్ ఇంజినీర్ అమర్‌సింగ్ రూ.30 వేల లంచం డిమాండ్చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, శనివారం డబ్బులు తీసుకుంటుండగా నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.