శంషాబాద్ మెట్రో రైలుకు టెండర్లు ఆహ్వానం.. నోటిఫికేషన్ రిలీజ్

శంషాబాద్ మెట్రో రైలుకు టెండర్లు ఆహ్వానం.. నోటిఫికేషన్ రిలీజ్

హైద్రాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో.. రాయదుర్గం–శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మధ్య నిర్మించిన ఈ ప్రాజెక్టు కోసం.. 2023, మే 16వ తేదీన టెండర్లను ఆహ్వానిస్తూ.. హెచ్ఏఎంఎల్  నోటిఫికేషన్ జారీ చేసింది. మే 17వ తేదీ నుంచి బిడ్డింగ్  పత్రాలను జారీ చేయనుంది. హైద్రాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్  ఈ  నోటిఫికేషన్ జారీ చేసింది. ఎయిర్ పోర్టు మెట్రో బిడ్డింగ్ కు  చివరి తేదీ  జూలై 5 గా  నిర్ణయించారు. శంషాబాద్ మెట్రో కాంట్రాక్టు  విలువ 5 వేల 648 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. 2022  డిసెంబర్  9వ తేదీన  మెట్రో నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్  శంకుస్థాపన  చేశారు.

రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు  31 కిలోమీటర్ల మైట్రో ఏర్పాటు చేయనున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ కు కేవలం 31 నిమిషాల్లోనే చేరుకునే విధంగా ప్లాన్ చేశారు. 31 కిలోమీటర్ల మార్గంలో.. రెండున్నర కిలోమీటర్లు భూగర్భంలో లైన్ను నిర్మించనున్నారు. తొమ్మిది స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్లలో  హైద్రాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైలు పనులను  పూర్తి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

శంషాబాద్ మెట్రో విశేషాలు :

-పొడవు : 31 కిలోమీటర్లు (మొత్తం)
-ఎలివేటెడ్‌ వే : 27.5 కిలోమీటర్లు
-రోడ్‌ వే : 1 కిలోమీటర్‌
-అండర్‌ గ్రౌండ్‌ వే : 2.5 కిలోమీటర్లు
-వేగం: 120 కిలోమీటర్ల స్పీడ్
-ఫ్రీక్వెన్సీ : ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక ట్రైన్ (రద్దీని ఆధారంగా) 
మొత్తం -స్టేషన్లు : 8 నుంచి 9  మెట్రో స్టేషన్లు
-ప్రారంభం : రాయదుర్గం టెర్మినల్‌ 
-ప్రాజెక్టు సమయం: 36 నెలలు