హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్) సోమవారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సరికొత్త 'కార్గో టెర్మినల్ 2' ను ప్రారంభించింది. 16,864 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మించింది. ఈ టెర్మినల్ స్టార్టింగ్‌లో ఏడాదికి 50 వేల మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేయగలుగుతుంది. భవిష్యత్తులో దీనిని 10 లక్షల మెట్రిక్ టన్నులకు విస్తరించుకోవచ్చు.
ఇందులో ఎగుమతులు, దిగుమతుల కోసం విడివిడిగా జోన్లు, నిల్వ సామర్థ్యాన్ని పెంచే మల్టీ-లెవెల్ రాకింగ్ సిస్టమ్స్, వేగవంతమైన రవాణాకు అనుకూలమైన వసతులు ఉన్నాయి.
హైదరాబాద్ గ్లోబల్ ఫార్మా హబ్‌గా ఎదుగుతుండడంతో ఈ టెర్మినల్‌లో టెంపరేచర్స్ నియంత్రించే ఒక భారీ 'ఫార్మా జోన్' ను నిర్మించారు. ఇది లైఫ్ సేవింగ్ ఫార్మాస్యూటికల్స్, త్వరగా పాడైపోయే వస్తువులను సురక్షితంగా రవాణా చేయడంలో సాయపడుతుంది.
