మళ్లీ ఆడపిల్ల పుట్టిందని..14 రోజుల చిన్నారిని గొంతుకోసి చంపిన తండ్రి

మళ్లీ ఆడపిల్ల పుట్టిందని..14 రోజుల చిన్నారిని గొంతుకోసి చంపిన తండ్రి

మెహిదీపట్నం, వెలుగు: రెండోసారి కూడా కూతురు పుట్టిందని కన్న తండ్రే ఆ శిశువును గొంతుకోసి హత్య చేశాడు. నేపాల్​కు చెందిన జగత్ కొన్నేండ్ల కింద హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. గుల్షన్ కాలనీలోని ఓ అపార్ట్​మెంట్​లో వాచ్​మన్ గా పనిచేస్తున్నాడు. జగత్ దంపతులకు 14 రోజుల కింద మరో ఆడపిల్ల జన్మనిచ్చింది. రెండోసారి కూడా కూతురు పుట్టిందన్న కోపంతో జగత్​ శిశువు గొంతు కోసి చంపేశాడు. డెడ్ బాడీని స్థానిక 7 టూమ్స్ ప్రాంతంలోని చెత్త కుప్పలో పడేశాడు.  స్థానికులిచ్చిన సమాచారంతో గోల్కొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.