హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వర్సిటీ వాలీబాల్ లీగ్ షురూ

హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వర్సిటీ వాలీబాల్ లీగ్ షురూ

హైదరాబాద్, వెలుగు: యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాలీబాల్ స్కిల్స్ పెంచేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వర్సిటీ వాలీబాల్ లీగ్ శనివారం నగరంలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో అలరించిన తొలి రోజును ఆర్గనైజర్స్ ‘గోల్డెన్ టికెట్ డే’ గా పేర్కొన్నారు. వర్సిటీ స్పోర్ట్స్, ప్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాలీబాల్ లీగ్ జట్టు హైదరాబాద్ బ్లాక్ హాక్స్  నిర్వహిస్తున్న ఈ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 50కి పైగా ప్రముఖ ఐబీ, సీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ స్కూల్ టీమ్స్ పాల్గొంటున్నాయి.

తొలి రోజు పోటీల్లో గెలిచిన 16 బాయ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 12 గర్ల్స్ టీమ్స్ లీగ్ తదుపరి దశకు అర్హత సాధించాయి. ఈ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొత్తం 36 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జరగనున్నాయి. ప్రైమ్ వాలీబాల్ లీగ్ స్ఫూర్తితో సూపర్ సర్వ్, సూపర్ పాయింట్ లాంటి ఆసక్తికరమైన నిబంధనలను ఇందులో చేర్చారు.  ఈ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా  స్టేట్‌‌, సిటీ నుంచి ఎక్కువ మంది ప్లేయర్లు భవిష్యత్తులో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నామని బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాక్స్ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంకణాల అభిషేక్ రెడ్డి చెప్పారు. యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించి, వారిని క్రీడల వైపు ఆకర్షించడమే తమ టార్గెట్ అన్నారు.