అలర్ట్.. హైదరాబాద్లో కరెంట్ కోతలు ఇలా

అలర్ట్..  హైదరాబాద్లో కరెంట్ కోతలు ఇలా

హైదరాబాద్‌ ప్రజలకు ముఖ్య గమనిక  ..  నగరంలో మరమ్మతు పనుల్లో భాగంగా 24 రోజుల పాటు కరెంట్ కోతలు ఉంటాయని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) ప్రకటించింది.  ఈ మేరకు హైదరాబాద్‌లో షెడ్యూల్డ్ పవర్ కట్‌లను ప్రకటించింది. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో రొటేషన్ ప్రాతిపదికన విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్‌లపై నిర్వహణ,  మరమ్మతు పనులను TSSPDCL చేపడుతుంది. 

ఈ క్రమంలో జనవరి 17వ తేది అనగా బుధవారం నుంచి  వచ్చే నెల ఫిబ్రవరి 10 వరకు అంటే 24 రోజుల పాటు 15 నిమిషాల నుంచి 2 గంటలపాటు నిర్వహణ పనులు చేయాలని అధికారులు నిర్వహించారు.  ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లో విద్యుత్ కోతలకు మినహాయింపు ఇచ్చారు. ఈ విద్యుత్ కోతల వల్ల ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని. నిర్వహణ పనులు చేపట్టాల్సిన ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని TSSPDCL కోరింది. 

ఎక్కడెక్కడంటే

విద్యుత్ అంతరాయ కలిగే ప్రాంతాలకు సంబంధించిన వివరాలను TSSPDCL తమ వెబ్ సైట్లో అప్ లోడ్ చేసింది. హైదరాబాద్ సెంట్రల్, సరూర్ నగర్, హైదరాబాద్ సౌత్, సైబర్ సిటీ, రాజేంద్రనగర్, హైదరాబాద్ సెంట్రల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్, సిద్దిపేట ఏరియాల్లో కరెంట్ కోతలు ఉండనునన్నాయి.