- హై టెంపరేచర్లతో కార్ల ఇంజన్ల ఓవర్ హీటింగ్
- ఫ్యూయల్ లైన్ లీక్, బ్యాటరీ ప్రాబ్లమ్స్, షార్ట్ సర్క్యూట్, ఓల్డ్ వైరింగ్ కారణాలు
- మెయింటెనెన్స్, సర్వీసింగ్ లేకనే..
- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న ఎక్స్పర్ట్స్
సరిగ్గా..15 రోజుల కింద..ఆదివారం రాత్రి ఖైరతాబాద్ లో ప్రయాణిస్తున్న ఒక కారుకు మెట్రో స్టేషన్‌సమీపంలో అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. ఇంజిన్‌నుంచి మంటలు రావడంతో గమనించిన డ్రైవర్, మరో ఇద్దరు కిందకు దిగడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. అలాగే, బేగంపేట డార్క్బంగ్లా వద్ద ఏప్రిల్14న, శంషాబాద్సిద్ధాంతి వద్ద ఏప్రిల్16న, బంజారాహిల్స్బసవతారకం క్యాన్సర్హాస్పిటల్వద్ద18న నడుస్తున్న కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఏప్రిల్17న కూకట్పల్లి మెట్రో పిల్లర్‌నంబర్834 వద్ద నడుస్తున్న ఓ ట్రావెల్స్బస్సులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ఆపడంతో 18 మంది కిందకు దిగా ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశమే..అయినా కార్లు, ఇతర వాహనాలు నడిపేవారు అసలు ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలని, భవిష్యత్తులో వాహనాలు కాలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఎండాకాలం వచ్చిందంటే మనం అక్కడక్కడా అకస్మాత్తుగా కార్లలో మంటలు వచ్చి కాలిపోయాయన్న వార్తలు చదువుతూ ఉంటాం. ఈ నెలలో ఎండలు మండడం మొదలైందో లేదో అప్పుడే నాలుగు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. 42 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆ వేడికి ప్రయాణంలో ఉండగానే కార్లలోంచి పొగలు వచ్చి..నిమిషాల్లోనే పూర్తిగా దగ్ధమైపోతున్నాయి. కేవలం అధిక ఉష్ణోగ్రతల వల్లే ఇలా జరుగుతుందని చాలా మంది అనుకుంటున్నా...ఇతర కారణాలు వీటికి దోహదం చేస్తున్నాయని ఎక్స్పర్ట్స్చెప్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలు ఒక కారణం అని, మెయింటనెన్స్లేకపోవడం అగ్నికి ఆజ్యం పోస్తోందంటున్నారు. కారు ఇంజిన్, బ్యాటరీ, వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఎండ వేడి వాటిపై ప్రభావం చూపి కాలిపోతున్నాయంటున్నారు.
ఫ్యూయల్ లైన్‌లో చిన్న లీక్.. పెద్ద ప్రమాదానికి కారణం
ప్రస్తుతం నగరంలో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కారులో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే, ఇంజిన్ లో అది 60 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ టైంలో ఫ్యూయల్ లైన్‌లో చిన్న లీక్ ఉన్నా, ఆ ఆవిరి ఇంజిన్ దగ్గరకు చేరుతుంది. ఈ సమయంలో చిన్న స్పార్క్ కూడా పెద్ద మంటలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఎండలు మండుతున్నప్పుడు ట్రాఫిక్‌లో మెల్లి మెల్లిగా ఆగుతూ వెళ్లే వాహనాల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చీప్క్వాలిటీ వైరింగ్..
కార్లలో చీప్క్వాలిటీ వైరింగ్చేయించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లలో ఉండే బ్యాటరీలు, ఆల్టర్నేటర్, వైర్లపై ఎండల ప్రభావం ఉంటుంది. పాత వైర్లు లేదా చీప్ క్వాలిటీ వైరింగ్ ఉంటే ఇన్సులేషన్ కరుగుతుంది. అప్పుడు షార్ట్ సర్క్యూట్ జరిగి స్పార్క్ అయ్యేలా చేస్తుంది. అందుకే ఎక్కువగా పాత కార్లలో లేదా సరిగా సర్వీసింగ్ చేయించని వాహనాల్లోనే ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది.
ఇంజిన్ ఓవర్ హీటింగ్ ..
కారు ఇంజిన్ అవసరమైన టెంపరేచర్ కంటే ఎక్కువ వేడెక్కితే దాన్ని ఇంజిన్ ఓవర్ హీటింగ్ అంటారు. హై టెంపరేచర్ వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల ఒక్కసారిగా కారు ఆగిపోతుంది. ఎండాకాలంలో కూలెంట్ స్థాయి తగ్గిపోవడం, రేడియేటర్ కూడా సరిగ్గా పని చేయకపోతే ఇంజిన్ లో టెంపరేచర్ ఎక్కువగా పెరుగుతుంది. దీంతో గాస్కెట్ డ్యామేజ్ అయి కూలెంట్, ఆయిల్ కలిసిపోవడంతో పొగ వచ్చి మంటలు రావడానికి కారణమవుతుంది. అలాగే, ఇంజిన్‌లో నుంచి పొగను బయటకు పంపేది ఎగ్జాస్ట్ సిస్టమ్. ఎండలకు ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ వేడి అయినా, వాహనంలో ఉన్న ప్లాస్టిక్ భాగాలు కాలిపోయి మంటలంటుకోవడానికి కారణమవుతాయి.
మెయింటనెన్స్లోపం..
ముఖ్యంగా పాత వాహనాలు, సర్వీస్ చేయని కార్లు ఎక్కువగా కాలిపోతున్నాయని తేలింది. వీటిల్లోనూ ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని మెహిదీపట్నానికి చెందిన కార్మెకానిక్నవీన్చెప్తున్నారు. చిన్న సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల పెద్ద ప్రమాదాలు జరుగుతాయంటున్నారు. లీకేజీలు, లూజ్ వైర్లు ఉండడం..ఎండాకాలంలో వేడి పెరగడం ముప్పును పెంచుతాయని నిపుణులైన మెకానిక్‌లు అంటున్నారు. అందుకే కార్లు నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా మంటలు వస్తాయని, ఎప్పుడూ రెగ్యులర్‌గా మెయింటనెన్స్చేయిస్తే ఇలాంటివి జరిగే అవకాశం ఉండదని అంటున్నారు.

