
హైదరాబాద్ మియాపూర్- చందానగర్ మార్గంలోని జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మదీనాగుడ దీప్తిశ్రీ నగర్ నుంచి గంగారం వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
Also Read :- మందు తాగుతూ చనిపోయాడు
చందానగర్ జాతీయ రహదారిపై జ్యువెలరీ షాప్ ప్రారంభం కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై యుటర్న్ దగ్గర వాహనదారులు ఇష్టానుసారంగా రాంగ్ రూట్ లో రావడంతో ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు తెలిపారు.