విద్యార్థులను దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతోంది

విద్యార్థులను దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతోంది
  • హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఆనంద్

సికింద్రాబాద్, వెలుగు: బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్​లోకి అడుగుపెట్టగానే.. ఇక్కడ తాను స్టూడెంట్​గా ఉన్న రోజలు గుర్తుకొస్తున్నాయని సిటీ సీపీ ఆనంద్ అన్నారు. శనివారం స్కూల్​లో జరిగిన  యాన్యువల్ ఇన్వెస్టెజర్ సెలబ్రేషన్స్​కు ఆయన చీఫ్ గెస్టుగా  హాజరయ్యారు. 
ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ మార్చ్ ​ఫాస్ట్​లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. సీపీ మాట్లాడుతూ.. స్కూల్ ఆవరణలోకి రాగానే తాను ఇక్కడ చదివిన రోజులు గుర్తుకు తెచ్చుకున్నానని చెప్పారు. ఈ స్కూల్ నుంచే క్రికెట్ ప్లేయర్ గా స్టేట్ లెవెల్ లో ఆడానన్నారు. వచ్చే ఏడాది శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్న బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నేటికీ అదే స్ఫూర్తితో స్టూడెంట్లను దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతోందన్నారు.