కార్పొరేట్ ఆఫీసుల అడ్డా హైదరాబాద్

కార్పొరేట్ ఆఫీసుల అడ్డా హైదరాబాద్
  • ఆఫీస్ స్పేస్ లీజింగ్‌ లో నంబర్‌ వన్‌
  • బెంగళూరును వెనక్కితోసి మొదటి స్థానం
  • దేశ, విదేశాల నుంచి క్యూ కడుతున్న కంపెనీలు, స్టార్టప్‌ లు
  • వెల్లడించిన సీబీఆర్‌ ఈ రిపోర్టు

కొత్త ఆఫీసులకు హైదరాబాద్‌ అడ్డాగా మారుతోం ది! మంచి వసతులు, తక్కువ అద్దె, సెక్యూరి టీకి ఫిదా అయి దేశ విదేశాల నుంచి కంపెనీలు, స్టార్టప్‌ లు భాగ్యనగరాన్ని వెతుక్కుంటూ వస్తు న్నాయి. దీంతో ఆఫీస్‌ స్పేస్‌ కు డిమాం డ్‌భారీగా పెరుగుతోం ది. ఇప్పటి దాకా ఆఫీస్ స్పేస్ లీజింగ్‌‌లో రారాజుగా ఉన్న బెం గుళూరును వెనక్కు నెట్టి హైదరాబాద్‌ నంబర్‌‌ వన్‌‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది జనవరి–-మార్చి క్వార్టర్‌‌లో 35 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌‌తో ముందంజలో నిలిచినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్​ సీబీఆర్‌‌‌‌ఈ రిపోర్ట్‌‌ వెల్లడించిం ది.

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ వేగంగా వృద్ధి చెందుతోం ది. బెంగళూరును సైతం వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జనవరి–మార్చి మూన్నెళ్ల కాలంలో సిటీలో 35 లక్షల చదరపు అడుగులు స్థలం ఆఫీసులకు లీజుకు ఇవ్వగా..గతేడాది ఇదే కాలంలో ఇది 11 లక్షల చదరపు అడుగులుగా ఉందని ప్రాపర్టీ కన్సల్టంట్ సీబీఆర్‌‌‌‌‌‌‌‌ఈ రిపోర్ట్‌‌‌‌లో తెలిపింది. దేశవ్యాప్తంగా 9 ముఖ్య నగరాల్లోఆఫీస్ స్పేస్ లీజింగ్ మూడు శాతం పెరిగి కోటీ 28లక్షల చదరపు అడుగులకు చేరింది. గతేడాది ఇది కోటీ 26 లక్షల చదరపు అడుగులుగా ఉంది. మొదటిసారిగా ఈ విభాగంలో బెంగుళూరును వెనక్కి తోసి హైదరాబాద్ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ స్థానంలో నిలిచింది.

ఆఫీస్ స్పేస్ లీజింగ్‌‌‌‌కు ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా ఈ రికార్డు సాధించడానికి తోడ్పడ్డాయి. హైదరాబాద్ సూపర్‌ ‌‌‌భాగ్యనగరం అన్ని రకాలుగా అనువైన ప్రాంతం కావడంతో కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువ అద్దె, మెరుగైన సదుపాయాలు, కొత్తగా వచ్చిన మెట్రో, ఇక్కడి టాలెంట్‌‌‌‌, భద్రత, భౌగోళిక పరిస్థితులు, కాస్మోపాలిటన్ కల్చర్‌‌‌‌తో కంపెనీలు హైదరాబాద్‌‌‌‌ వైపు చూస్తున్నా యి. మాల్స్, ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ వంటివి భారీ స్థాయిలో పెరుగుతున్నా కమర్షియల్ స్పేస్ మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. ఇళ్ల ధరలు కూడా అందుబాటులోనే ఉండడంతో ఐటీ ఉద్యోగులు కూడా హైదరాబాద్‌‌‌‌లోనే సెటిల్ అవడానికి మొగ్గు చూపుతున్నారు.

లార్జ్ లీజింగ్ డీల్స్‌ లో మనదే పైచేయి

లీజింగ్‌‌‌‌లో 48 శాతం వాటా 10 వేల నుంచి 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన వాటివే కావడం గమనార్హం. 10 వేల చదరపు అడుగుల లోపు విస్తీర్ణం కలిగిన వాటి వాటా 33 శాతం. లక్ష చదరపు అడుగుల కంటే పైబడిన లార్జ్ డీల్స్ లావాదేవీలు10శాతంగా ఉన్నాయి. వీటిలో కూడా హైదరాబాద్‌‌‌‌దే ముందుంది. టెక్ కార్పోరేట్లు, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్లు లార్జ్ స్కే ల్ డీల్స్‌‌‌‌ను దక్కించుకున్నా యి. కొన్నిఈ కామర్స్, బీఎఫ్ఎస్‌ఐ, ఇంజినీరింగ్ అండ్ మానుఫాక్చరింగ్ వంటి కంపెనీలు కూడా పెద్ద మొత్తంలోఆఫీస్ స్పేస్‌‌‌‌ను లీజ్‌‌‌‌కు తీసు కున్నా యి. టెక్ మహీంద్రా, కోవర్క్స్, డీబీఎస్, క్వాల్‌‌‌‌కమ్, కెర్నెర్ వంటి కంపెనీలుపెద్ద మొత్తంలో ఆఫీస్ స్పేస్‌‌‌‌ను లీజుకు తీసుకున్నా యి.

పెరిగిన కిరాయిలు

పెరుగుతున్న డిమాండ్‌ కు అనుగుణంగా కిరాయిలు కూడా పెరగుతున్నాయి. హైదరాబాద్‌‌‌‌లో ప్రాంతాన్నిబట్టి కిరాయిలు 2–8 శాతం దాకా ఎక్కువయ్యాయి.ముఖ్యంగా ఐటీ కారిడార్లలో ఇది కొట్టొచ్చినట్టు కన్పిస్తోం ది. కొం డాపూర్, గచ్చిబౌలి, రాయ్‌‌‌‌దుర్గంలలో అద్దెలు 7.7 శాతం పెరగ్గా, మణికొండ, నానక్‌ రామ్‌‌‌‌గూడ ప్రాంతాల్లో 5.3 శాతం పెరిగింది. ఇక హైటెక్ సిటీ, మాదాపూర్‌‌‌‌లో 4.6 శాతం పెరిగాయి.రాయదుర్గం, కొండాపూర్‌‌‌‌‌‌‌‌లలో కొత్తగా భారీస్థాయిలో ఓ సెజ్ ఏర్పాటు కావడంతో పాటు రెండు ఐటీ డెవలప్‌ మెంట్ సెంటర్లు కూడా రావడంతో ఆఫీస్ స్పేస్ భారీగా అందుబాటులోకి వచ్చింది. కోకాపేటలో ఒక మీడియం సైజ్ సెజ్, పీబీడీలో ఒక మీడియం సైజ్ సెజ్ కూడా వాడుకలోకి వచ్చాయి. రాయదుర్గం, నానక్‌ రామ్‌‌‌‌గూడ ఐటీ కారిడార్‌‌‌‌లో లీజింగ్ కార్యకలాపాలు కాస్త తగ్గగా.. సెజ్‌‌‌‌లలో కొన్ని మధ్య–భారీ తరహా డీల్స్ జరిగాయి. మాదాపూర్, హైటెక్‌ సి టీ ఐటీకారిడార్‌‌‌‌లో చిన్న తరహ డీల్స్ ఎక్కువగా ఉన్నాయి.

మరికొంత కాలం ఇదే జోష్

బెంగుళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్‌‌‌‌లో తగ్గుదల నమోదైంది. గత ఏడాది 55 లక్షల చదరపు అడుగుల లీజింగ్ జరగ్గా.. ఈసారి అది 25 లక్షల చదరపు అడుగులకే పరిమితమైం ది. కార్పోరేట్ కంపెనీలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని భావిస్తుండడంతో ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు మరికొం త కాలంపాటు వృద్ధి బాటలోనే ఉంటాయని సీబీఆర్‌‌‌‌‌‌‌‌ఈ సౌత్‌‌‌‌ఈస్ట్ ఏషియా చైర్మన్ అన్షుమన్ మాగజైన్ తెలిపారు. అమెరికా, ఇతర దేశాల నుంచి కంపెనీలు వచ్చే అవకాశం ఉండడంతో డిమాండ్‌ మరింత పెరగొచ్చని ఆయన తెలిపారు.

టెక్‌ నుంచే ఎక్కువ డిమాండ్

ఆఫీస్‌‌‌‌ స్పేస్‌‌‌‌లో టెక్ కార్పోరేట్‌‌‌‌ సంస్థలు ఎప్పట్లాగే మేజర్ వాటా దక్కించుకున్నాయి. గత ఏడాది లీజింగ్‌‌‌‌లో 22 శాతం వాటా సొంతం చేసుకున్న టెక్‌ కార్పోరేట్లు ఈ ఏడాది 33 శాతం వాటా తీసుకున్నారు. కో వర్కింగ్ స్పే స్ వాటా 16 శాతంగా ఉన్నట్లు సీబీఆర్‌‌‌‌‌‌‌‌ఈ ఇండియా రిపోర్ట్‌ ‌‌‌ వెల్లడించింది. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల వాటా ఏడాదిలో 5 శాతం నుండి16 శాతానికి పెరిగింది. ఎన్‌‌‌‌సీఆర్ (నేషనల్ కాపిటల్ రీజియన్) లో ఆఫీస్ లీజింగ్ గత ఏడాది జనవరి–మార్చి కాలానికి 21 లక్షల చదరపు అడుగులు కాగా,ఈ ఏడాది అదే కాలంలో లీజింగ్ 16 లక్షల చదరపు అడుగులకు పడిపోయిం ది. ముంబైలో 15 లక్షలచదరపు అడుగుల నుంచి 21 లక్షల చదరపు అడుగులకు వృద్ధి చెందింది. హైదరాబాద్, బెంగుళూరు,ఎన్‌‌‌‌సీఆర్, ముంబైల వాటానే 75 శాతంగా ఉంది.